Tue Mar 17 2026 03:48:47 GMT+0530 (India Standard Time)
నేడు విశాఖకు జగన్.. మూడురోజులు అక్కడే
నేటి నుంచి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నంలోనే ఉంటారు.గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో పాల్గొంటారు

నేటి నుంచి మూడు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖపట్నంలోనే ఉంటారు. ఆయన ఈరోజు సాయంత్రం తాడేపల్లి నుంచి బయలుదేరి వచ్చి 3,4 తేదీల్లో విశాఖలో జరిగే గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో పాల్గొంటారు. ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 5.15 గంటలకు విశాఖపట్నం చేరుకుంటారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం 9.10 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్ కు చేరుకుని గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో పాల్గొంటారు.
గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్లో...
రేపు రాత్రికి 8 గంటలకు ఎంజీఎం పార్క్ హోటల్ లో జీఐఎస్ డెలిగేట్ల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో జగన్ పాల్గొంటారు. నాలుగో తేదీ ఉదయం 9.10 గంటలకు తిరిగి ఏయూ ఇంజినీరింగ్ కళాశాల గ్రౌండ్స్ కు చేరుకుని గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు విశాఖ నుంచి బయలుదేరి 3.40 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
Next Story

