Mon Apr 06 2026 22:04:00 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం
వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకోనున్న జగన్ తాజా రాజకీయ పరిణామాలపై మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు.
తాజా రాజకీయ పరిణామాలపై...
ప్రధానంగా ఇందాపూర్ కంపెనీ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం నెయ్యి కొనుగోలు విషయంతో పాటు తిరుమల లడ్డూ విషయంలో అధికార పార్టీ చేసిన రాద్ధాంతపైనే ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు తెలిసింది. దీంతో పాటు అక్రమ కేసులతో పాటు పలు భూ కేటాయింపులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ఈ మీడియా సమావేశంలో మాట్లాడనున్నారని చెబుతున్నారు.
Next Story

