Thu Dec 11 2025 05:35:44 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఈ నెల 18న గవర్నర్ తో జగన్ భేటీ
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 18వ తేదీన గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ కానున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఈనెల 18వ తేదీన గవర్నర్ అబ్దుల్ నజీర్ తో భేటీ కానున్నారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం నుంచి అపాయింట్ మెంట్ లభించింది. ప్రజా ఉద్యమం, కోటి సంతాకాలపై గవర్నర్కు ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయివేటు మెడికల్ కళాశాలలను వ్యతిరేకిస్తూ వైసీపీ గత కొంత కాలంగా సంతకాల సేకరణ చేపట్టింది.
కోటి సంతకాల సేకరణ...
అన్ని నియోజకవర్గాల్లో సంతకాలను సేకరించారు. వాటిని పార్టీ కార్యాలయానికి తీసుకు రావాల్సిందిగా మాజీ ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా సేకరించిన కోటి సంతకాలతో కూడిన పత్రాలను గవర్నర్ ను కలసి జగన్ అందించనున్నారు. ప్రయివేటు వ్యక్తులకు ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు అప్పగించవద్దని కోరనున్నారు.
Next Story

