Thu Mar 19 2026 16:45:22 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ బటన్ నొక్కి
కొత్తగా ఎంపికయిన లబ్దిదారులకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ బటన్ నొక్కి నగదును అందచేయనున్నారు

ఆంధ్రప్రదేశ్ లో వివిధ పథకాలను ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకాలకు కొందరు దరఖాస్తు చేసుకోకపోవడం, తెలియక దూరంగా ఉండటం జరిగాయి. అయితే పథకాలకు సంబంధించి కొత్తగా తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశమిచ్చింది. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హుల జాబితాను అధికారులు పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేశారు. కొత్తగా లబ్దిదారులు ఎంపికయ్యారు. దాదాపు 3,39,096 మంది కొత్త లబ్దిదారులు వివిధ పథకాలకు ఎంపికయ్యారు.
కొత్తగా ఎంపికయిన...
వీరందరికీ ముఖ్యమంత్రి జగన్ నేడు నగదును అందజేస్తారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వీరికి నగదును అందచేయనున్నారు. ఈ పథకాల కింద 936 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. పింఛన్లు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసమూ కొత్తగా ఎంపికయ్యారు. కొత్తగా ఎంపికయిన అమ్మఒడి, ఆసరా పధకాల వంటి లబ్దిదారులకు నగదును పంపిణీ చేయనున్నారు.
Next Story

