Mon Mar 23 2026 23:15:41 GMT+0530 (India Standard Time)
Ys Jagan : రేపు గుంటూరు, విజయవాడల్లో జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు గుంటూరు, విజయవాడల్లో పర్యటించనున్నారు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు గుంటూరు, విజయవాడల్లో పర్యటించనున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. రేపు గుంటూరులోని అంబటి రాంబాబు నివాసానికి జగన్ చేరుకుంటారు. అక్కడ టీడీపీ శ్రేణుల దాడికి గురైన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం అంబటి భార్య, కుటుంబ సభ్యులతో మాట్లాడతారు.
జోగి రమేష్ కుటుంబాన్ని...
అనంతరం ఇబ్రహీంపట్నంకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేరుకుంటారు. జోగి రమేష్ ఇంటిపై పెట్రోలు బాంబులు విసరడంతో పాటు బీభత్సం చేయడంతో ఆ కుటుంబాన్ని కూడా జగన్ పరామర్శిస్తారు. పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇవ్వనున్నారు. ఇప్పటికే ఈ రెండు కుటుంబాలను వైసీపీ నేతలు పరామర్శించారు. అక్కడ పరిస్థితులను చూసి జగన్ కు తెలియజేశారు. ఘటన జరిగిన వెంటనే అంబటి, జోగి రమేష్ లకు ఫోన్ లు చేసి జగన్ పరామర్శించారు.
Next Story

