చంద్రబాబుపై జగన్ ఏశేశాడుగా.. ట్వీట్ తో
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెటైర్ వేశారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సెటైర్ వేశారు. ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. " చంద్రబాబుగారూ… మీ కథ, స్క్రీన్, ప్లే, దర్శకత్వంలో విజయవంతంగా నడుస్తున్న “క్రెడిట్ చోరీ స్కీం’’ చాలా బాగుంది. పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా… దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా… ఒక్కరికి ఒక్క ఇల్లుకూడా మంజూరు చేయకుండా… గత ప్రభుత్వం అంటే వైయస్సార్సీపీ ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటి స్థలాల్లోనే, వైయస్సార్సీపీ గతంలో శాంక్షన్ చేయించిన ఇళ్లను, మా ప్రభుత్వ హయాంలోనే నిర్మాణంలో ఉన్నవాటిని పట్టుకుని “ఇళ్లన్నీ మేమే కట్టేశాం” అంటూ పచ్చి అబద్ధాలను కళ్లార్పకుండా, ఏ మాత్రం సిగ్గుపడకుండా, బల్లగుద్దీ మరీ చెప్తూ… ఆ క్రెడిట్ మీదేనంటూ మీరు చేస్తున్న క్రెడిట్ చోరీ స్కీం హేయంగా ఉంది. ఇతరుల కష్టాన్ని తన గొప్పతనంగా చెప్పుకునేవాడు నాయకుడు కాదు, నాటకాల రాయుడు అంటారు." అంటూ జగన్ ట్వీట్ చేశారు.

