Fri Jan 17 2025 22:39:48 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : ఆ టిప్పర్ డ్రైవర్ కు అందుకే నేను టిక్కెట్ ఇచ్చా
శింగనమల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అని వైఎస్ జగన్ అన్నారు
శింగనమల నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ అని వైఎస్ జగన్ అన్నారు. ఎమ్మిగనూరు సభలో ఆయన మాట్లాడుతూ అయితే తాను టిప్పర్ డ్రైవర్ కు టిక్కెట్ ఇచ్చానంటూ చంద్రబాబు హేళన చేశారన్నారు. పేదలంటే చంద్రబాబుకు ఎంత అలుసు అని జగన్ ప్రశ్నించారు. 175 నియోజకవర్గాల్లో తాను వంద మందికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిీలకు ఇచ్చానని ఆయన తెలిపారు. శింగనమల వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులు ఎమ్మెస్సీ చదివారన్నారు. బీఈడీ కూడా చదివారన్నారు.
పార్టీకి వీరాభిమాని కావడంతో...
కానీ చంద్రబాబు హయాంలో ఉద్యోగం దొరకక వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ గా మారాడన్నారు. వీరాంజనేయులు మన పార్టీ కార్యకర్త అని, కొన్నేళ్ల నుంచి వైసీపీ జెండాను మోసిన వ్యక్తి అని జగన్ తెలిపారు. అందుకే పేదవాడు అని చూడకుండా తాను టిక్కెట్ ఇచ్చానని అన్నారు. జగన్ పేదల పక్షపాతి అని అనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలని జగన్ ప్రశ్నించారు. రాజకీయాల్లో పేద, ధనికులు తేడా లేదని, సేవ చేసే వారు ఎవరైనా రావచ్చని చాలా మంది నిరూపించారు.
Next Story