Fri Jan 30 2026 02:02:06 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : త్వరలో మోడీని కలుస్తా.. ఢిల్లీలో ధర్నా చేస్తా
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాడులపై త్వరలో ప్రధాని మోదీని కలిసి పరిస్థితులను వివరిస్తానని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు

ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాడులపై త్వరలో ప్రధాని మోదీని కలిసి పరిస్థితులను వివరిస్తానని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. వినుకొండలో రషీద్ కుటుంబాన్ని పరామర్శిచంిన తర్వాత ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రత్యర్ధి పార్టీ కార్యకర్తలపై దాడులకు దిగుతుందని తెతలిపారు. ఏపీలో అరాచక పాలన నడుస్తుందని ఆయన అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఈ నెల ఇరవై నాలుగోతేదీన ఢిల్లీలో ధర్నా చేస్తామని చెప్పారు. ఎస్పీలను మార్చి మరీ మర్డర్ లకు తెగబడుతున్నారన్నారు. హత్య చేసిన వారిని వదిలి తిరిగి బాధితులపైనే కేసులు నమోదు చేస్తున్నారన్నారు.
రషీద్ కుటుంబానికి ...
రషీద్ కుటుంబానికి న్యాయం జరిగే వరకూ తాము పోరాటం చేస్తామని, ఎవరినీ వదిలేదిలేదని తెలిపారు. రషీద్ కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందన్న జగన్ పార్టీ కార్యకర్తలను మట్టుబెట్టడం వల్ల విజయం సాధించినట్లవుతుందని టీడీపీ భ్రమల్లో ఉందన్నారు. ప్రజా వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వంపై మొదలయిందన్నారు. తొలుత ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కక్షలు, కార్పణ్యాలతో ఆంధ్రప్రదేశ్ ను రావణకాష్టంగా మార్చారని జగన్ మండిపడ్డారు. ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని ఢిల్లీలో ధర్నా చేస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, ఎంపీ మిధున్ రెడ్డిపై కూడా దాడులకు దిగారన్నారు.
Next Story

