Mon Jan 20 2025 16:59:12 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : మ్యానిఫేస్టోలో ఏమి ఉండవో చెప్పిన జగన్
రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ జన సునామీని చూశామని వైఎస్ జగన్ అన్నారు. శ్రీకాకుళం లో జరిగిన సిద్ధం సభలో ఆయన మాట్లాడారు
రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ జన సునామీని చూశామని వైఎస్ జగన్ అన్నారు. శ్రీకాకుళం లో జరిగిన సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. జగన్ కు ఓటేస్తేనే ప్రస్తుతమున్న పథకాలు కొనసాగుతాయని, చంద్రబాబుకు ఓటేస్తే అవి ఆగిపోయినట్లేనని తెలిపారు. పేద ప్రజల గుండె చప్పుడే ఈ సిద్ధం సభ అని అన్నారు. మరో పద్దెనిమిది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయని, మంచి జరిగి ఉంటేనే వైసీపీకి ఓటు వేయాలని కోరారు. అందరూ ఇంట్లో కూర్చుని ఆలోచించుకుని, మాట్లాడుకుని ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకోవాలని ఆయన సూచించారు.
అలివికాని హామీలను...
2024లో తాను అలివి కాని వాగ్దానాలను ఇవ్వనని అన్నారు. నన్ను నమ్ముకున్న ప్రజలను మోసం చేయనని కూడా ఈ సభలో అన్నారు. చంద్రబాబు పెట్టే వాగ్దానాల వేలంలో తాను పాల్గొనని అన్నారు. చంద్రబాబుకు వాగ్దానాలు ఇవ్వడమే తప్ప వాటిని అమలు చేయరని అన్నారు. తాను మ్యానిఫేస్టో లో పెడితే ఖచ్చితంగా అమలు చేసేవే పెడతానని తెలిపారు. చంద్రబాబుకు లాగా మోసపు హామీలు ఇవ్వబోనని కూడా తేల్చి చెప్పారు. 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ చేస్తానని చేశాడా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళం సభలో ప్రసంగించిన అనంతరం జగన్ మేమంతా సిద్ధం సభలు ముగియడంతో తాడేపల్లికి పయనమయి వెళ్లారు.
Next Story