Sun Mar 15 2026 14:26:45 GMT+0530 (India Standard Time)
Ys Jagan : హఫీజ్‌ఖాన్ ను రాజ్యసభకు పంపుతున్నా
కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు తాను టిక్కెట్ కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నానని జగన్ అన్నారు

కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కు తాను టిక్కెట్ కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నానని జగన్ అన్నారు. అందుకే తాను హఫీజ్ ఖాన్ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. హఫీజ్ ఖాన్ ను రెండేళ్లలో ఖాళీ అయ్యే రాజ్యసభకు ఎంపిక చేస్తున్నానని, తాను మాట ఇస్తున్నానని చెప్పారు. అదే చంద్రబాబుకు, జగన్ కు తేడా అని జగన్ అన్నారు.
ముస్లిం అభ్యర్థిని...
ముస్లిం అభ్యర్థిని రాజ్యసభకు పంపుతానని తాను మాట ఇస్తున్నానని ఆయన ఎమ్మిగనూరు సభలో ప్రకటించారు. ఈ ఎన్నికల్లో హఫీజ్ ఖాన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ కర్నూలు నియోజకవర్గం అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ ను ప్రకటించారు. అందుకే హఫీజ్ ఖాన్ ను రాజ్యసభకు పంపుతున్నానని ఆయన తెలిపారు.
Next Story

