Fri Jan 30 2026 01:09:35 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : మళ్లీ వచ్చేది మనమే.. కాస్త ఓపిక పట్టండి
రెండు నెలల్లో ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత రావడం ఎన్నడూ చూడలేదని వైఎస్ జగన్ అన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన తెలిపారు

రెండు నెలల్లో ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత రావడం ఎన్నడూ చూడలేదని వైఎస్ జగన్ అన్నారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఆయన తెలిపారు. ఈరోజు యలమంచిలి నియోజకవర్గ ఎంపీీటీసీ, జడ్పీటీసీలతో జగన్ సమావేవమయ్యారు. మనం చేసిన మంచి ఎక్కడికీ పోలేదన్నారు. ప్రజలు తమ గుండెల్లోనే దాచుకుని ఉన్నారన్నారు. చంద్రబాబు నాయుడు ఖజానా ఖాళీ అంటూ తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
నాడు కూడా...
ఆరోజు వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా నాడు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పులున్నాయని ఆయన తెలిపారు. వాటికి వడ్డీలు కూడా చెల్లించామన్న జగన్, హామీలను ఎగ్గొట్టేందుకు చంద్రబాబు సాకులు చూపుతున్నారన్నారు. కరోనా లాంటి క్లిష్ట సమయంలోనూ వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆపలేదన్న విషయాన్ని వైఎస్ జగన గుర్తు చేశారు. శ్వేతపత్రాల పేరుతో గత ప్రభుత్వంపై నిందలు వేస్తూ తన చేతకాని తనాన్ని చంద్రబాబు ప్రదర్శిస్తున్నారన్నారు.
Next Story

