Wed Jul 16 2025 23:39:10 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : వైసీపీ కార్యకర్తలకు అండగా ఉంటా
వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులపై స్పందించారు.

వైఎస్ జగన్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులపై స్పందించారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొందని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీీప ముఠాలు స్వైర విహారం చేస్తున్నాయని అన్నారు. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రయివేటు ఆస్తులను ధ్వసం చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయిందన్నారు.
దాడులను ఆపండి...
అధికార పార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోందిన్నారు జగన్. ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయని తెలిపారు. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని ఈ దాడులను అరికట్టాలని జగన్ కోరరాు. ప్రజల ప్రాణాలు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు అండగా ఉంటామని చెప్పారు.
Next Story