Thu Feb 12 2026 06:03:59 GMT+0530 (India Standard Time)
Ys Jagan : అంబటి నివాసానికి చేరుకోవడానికి ఆరు గంటలు
వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంరబాబు నివాసానికి చేరుకున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంరబాబు నివాసానికి చేరుకున్నారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. టీడీపీ శ్రేణుల దాడిలో ధ్వంసమయిన ఇంటిని, కార్యాలయాన్ని తొలుత పరిశీలించారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం పదిన్నర గంటల పెద్ద సంఖ్యలో ఆయన పర్యటనకు అభిమానులు తరలి వచ్చారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేసిన ఘటనలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు జగన్ గుంటూరుకు చేరుకున్న ఆయన అంబటిఇంటికి చేరుకోవడానికి దాదాపు మూడు గంటల సమయం పట్టింది. అంబటి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అంబటి కుటుంబ సభ్యులకు వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. పోలీసులు సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉందని చెప్పినా వేల సంఖ్యలో కార్యకర్తలు తరలి వచ్చారు.
పోలీసులతో వాగ్వాదం...
అంబటి రాంబాబు ఇంటి వద్ద బ్యారికేడ్లు ఏర్పాటు చేసి అనుమతించకపోవడంతో పోలీసులతో నేతలు, కార్యకర్తలు వాగ్వాదానికి దిగారరు. తాడేపల్లి నుంచి ఉదయం పదిన్నర గంటలకు బయలుదేరిన జగన్ గుంటూరు లోని అంబటి రాంబాబు నివాసానికిచేరుకునే సరికి దాదాపు సాయంత్రం నాలుగున్నర అయింది. అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు దాడికి దారి తీసిన పరిస్థితులను కూడా వివరించారు. తాము భయభ్రాంతులకు గురి చేశారని వారు వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. దారి పొడవునా వైఎస్ జగన్ వాహనంపై ఆయన వాహనంపై పూలవర్షం కురిపించారు. జగన్ తో ఫొటో దిగేందుకు కార్యకర్తలు పోటీ పడ్డారు. జగన్ కు జడ్ ప్లస్ కేటగిరీ భద్రతను కల్పించారు. జగన్ తాడేపల్లి నుంచి గుంటూరుకు చేరుకున్నప్పటికీ అంబటి రాంబాబు ఇంటికి చేరుకోవడానికి చాలా సమయం పట్టింది. న్యాయపరంగా కూడా అంబటి రాంబాబుకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.
Next Story

