Sun Dec 14 2025 00:23:37 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : నర్సీపట్నానికి జగన్ ఆరుగంటల ప్రయాణం
వైసీపీ అధినేత జగన్ అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం వైద్య కళాశాలను పరిశీలించారు

వైసీపీ అధినేత జగన్ అనకాపల్లి జిల్లాలోని నర్సీపట్నం వైద్య కళాశాలను పరిశీలించారు. ఉదయం పదకొండు గంటలకు బయలుదేరిన జగన్ నర్సీపట్నానికి ఐదు గంటలకు చేరుకున్నారు. అడుగడుగునా పార్టీ నేతలు, కార్యకర్తలను పలకరిస్తూ జగన్ పర్యటన సాగింది. అక్కడ మెడికల్ కళాశాలను పరిశీలించిన అనంతరంర జగన్ మీడియాతో మాట్లాడారు. ప్రజారోగ్యం పట్ల ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జగన్ అన్నారు. పేద విద్యార్థుల పాలిట వైద్య విద్య మరింత భారంగా మారనుందని జగన్ అన్నారు.
పేదలకు దూరంగా...
ప్రతి జిల్లాకు తాము మెడికల్ కళాశాలకు తీసుకు వచ్చి ప్రజారోగ్యాన్ని కాపాడాలని ప్రయత్నాలు చేస్తే, ఈ కూటమి ప్రభుత్వం దానికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రయివేటు పరం చేయానికి పూనుకుందని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో వైద్యం మరింత ఖరీదుగా మారబోతుందని జగన్ అన్నారు. నర్సీపట్నంలో యాభై రెండు ఎకరాల్లో మెడికల్ కళాశాల నిర్మాణం చేపట్టాలని తాము భావించామని, ఆరు వందల పడకలతో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభమయ్యే పరిస్థితుల్లో ప్రయివేటు పరం చేస్తే పేదలకు వైద్యం ఎలా అందుతుందని జగన్ ప్రశ్నించారు.
Next Story

