Sat Mar 07 2026 17:29:10 GMT+0530 (India Standard Time)
నేడు విజయవాడలో సీఎం జగన్ పర్యటన
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విజయవాడలో పర్యటించనున్నారు. నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరగనున్న మౌలానా అబుల్ కలాం అజాద్ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉదయం 10.20 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ఆయన బయల్దేరుతారు. అజాద్ జయంతి సందర్భంగా మైనారిటీస్ వెల్ఫేర్ డే, నేషనల్ ఎడ్యుకేషన్ డే నిర్వహిస్తున్నారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు. జగన్ పర్యటన సందర్భంగా విజయవాడలో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేస్తున్నారు.
స్వతంత్ర భారత తొలి విద్యాశాఖ మంత్రి.. భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ 135వ జయంతి ఉత్సవాల్లో సీఎం జగన్ పాల్గొనున్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. డిప్యూటీ సీఎం అంజాద్ భాషా,ఎమ్మెల్సీలు తలశిల రఘురాం,రుహుల్లా,ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్, సబ్ కలెక్టర్ అదితిసింగ్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఏటా నవంబర్ 11వ తేదీని.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని దేశం మొత్తం జాతీయ విద్యా దినంగా, మైనారిటీ సంక్షేమ దినోత్సవంగా ఘనంగా నిర్వహిస్తుంటారు.
Next Story

