Sat Mar 14 2026 23:03:22 GMT+0530 (India Standard Time)
Ap Assembly : ప్రమాణ స్వీకారం చేసిన జగన్
అసెంబ్లీలో వైఎస్ జగన్ కూడా శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రారంభమయింది. గోరంట్ల బుచ్చయ్యచౌదరి ప్రొటెం స్పీకర్ గా సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించే కార్యక్రమం ప్రారంభమయింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత మంత్రులు వరసగా ప్రమాణ స్వీకారం చేశారు.
అందరికీ అభివాదం చేస్తూ...
అనంతరం వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులు ప్రమాణస్వీకారం ముగిసిన వెంటనే జగన్ పేరు పిలవడంతో ఆయన వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. అందరికీ వరసగా నమస్తకరించుకుంటూ సభలో జగన్ కనిపించారు. జగన్ ప్రమాణస్వీకారాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు ఆసక్తితో తిలకించడం కనిపించింది.
Next Story

