Thu Mar 19 2026 10:27:33 GMT+0530 (India Standard Time)
Ys Jagan : నేటితో ముగియనున్న బస్సు యాత్ర
వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనుంది. నేడు శ్రీకాకుళం జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుం

వైఎస్ జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేటితో ముగియనుంది. నేడు శ్రీకాకుళం జిల్లాలోకి జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది. ఈరోజుకు జగన్ బస్సు యాత్ర 22వ రోజుకు చేరుకుంది. రాత్రి బస చేసిన అక్కివలస నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. రోడ్ షో ద్వారా ఎచ్చెర్ల బైపాస్, శ్రీకాకుళం బైపాస్, నరసన్న పేట బైపాస్, కోటబొమ్మాళి, కన్నెవలస మీదుగా పరుశురాంపురం జంక్షన్ వద్దకు చేరుకుంటారు.
టెక్కలిలో బహిరంగ సభ...
అక్కడ భోజన విరామానికి ఆగుతారు. అనంతరం కె. కొత్తూరు మీదుగా టెక్కలి వద్దకు చేరుకుని అక్కడి జరిగే సభలో జగన్ ప్రసంగిస్తారు. దీంతో జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసినట్లే. గత నెల 27వ తేదీన ఇడుపులపాయ నుంచి బయలుదేరిన జగన్ అన్ని జిల్లాల్లో తిరుగుతూ బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ, రోడ్ షోలు నిర్వహిస్తూ నేడు టెక్కలితో ముగించనున్నారు.
Next Story

