Wed Apr 08 2026 11:14:24 GMT+0530 (India Standard Time)
YSRCP : నేడు తాడేపల్లిగూడెం నేతలతో జగన్
వైఎస్ జగన్ నేడు తాడేపల్లి గూడెం నియోజకవర్గం నేతలతో సమావేశం కానున్నారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ నేడు తాడేపల్లి గూడెం నియోజకవర్గం నేతలతో సమావేశం కానున్నారు. ఈ రోజు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేతలతో సమావేశమవుతారు.
పార్టీ బలోపేతంపై...
స్ధానిక సంస్ధల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో వైఎస్ జగన్ సమావేశం కానున్నారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులతో పాటు అక్కడ పార్టీ బలోపేతం పై తీసుకోవాల్సిన చర్యల గురించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అందరూ కలసి సమిష్టిగా పనిచేయాలని సూచించనున్నారు.
Next Story

