Fri Mar 20 2026 00:29:09 GMT+0530 (India Standard Time)
Ys Jagan : కాసేపట్లో జగన్ మీడియా సమావేశం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం పదకొండు గంటలకు మీడియా సమావేశంలో పాల్గొంటారు. ప్రధానంగా రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైఎస్ జగన్ మీడియా సమావేశంలో మాట్లాడే అవకాశాలున్నాయి. తమ ప్రభుత్వ హయాంలో నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం నిలిపేసిందన్న ఆరోపణలు చేయననున్నారు.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై...
ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపేసిందని, తమ ప్రభుత్వ హయాంలో రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఎంత వరకూ నిర్మించామో అన్ని వీడియోలు, ఫొటోలతో మీడియా ముందు జగన్ ఉంచే అవకాశాలుున్నాయి.
Next Story

