Thu Mar 23 2023 23:52:38 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ కీలక నిర్ణయం.. మేకపాటికి...?
ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పరిశీలకునిగా మెట్టుకూరు ధనుంజయరెడ్డిని నియమిస్తూ జగన్ ఉత్వర్వులు జారీ చేశారు

నెల్లూరు జిల్లాలో వైసీపీపై పార్టీ అధినేత ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసమ్మతి, అసంతృప్తి గళాలు వినిపిస్తుండటంతో వెంటనే చర్యలు తీసుకునే ప్రక్రియను ప్రారంభించారు. ఇప్పటికే వెంకటగిరి నియోజకవర్గానికి నేదురుమిల్లి రామ్ కుమార్ రెడ్డి సమన్వయకర్తగా నియమించారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బహిరంగ విమర్శలు చేయడంతో అక్కడ ఇన్ఛార్జిగా ఆదాల ప్రభాకర్ రెడ్డిని నియమించారు.
పరిశీలకుడిగా మెట్టుకూరి...
తాజాగా ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పరిశీలకునిగా మెట్టుకూరు ధనుంజయరెడ్డిని నియమిస్తూ జగన్ ఉత్వర్వులు జారీ చేశారు. ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గత కొంతకాలంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఛైర్మన్ మెట్టుకూరు ధనుంజయరెడ్డిని నియమించడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.
Next Story