Sat Dec 06 2025 17:28:06 GMT+0000 (Coordinated Universal Time)
విశాఖలో సీఎం ఇంటి గృహప్రవేశం?
త్వరలో విశాఖ నుంచి పరిపాలనను కొనసాగించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఇందుకు బీచ్ రోడ్ లో ఒక ఇంటిని సిద్ధం చేస్తున్నారు

త్వరలో విశాఖ నుంచి పరిపాలనను కొనసాగించేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. ఇందుకు బీచ్ రోడ్ లో ఒక ఇంటిని సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెల 22 లేదా 23 తేదీల్లో గృహప్రవేశం ఉంటుందని తెలిసింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో విశాఖ రాజధాని త్వరలోనే ఉంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ఇంటిని కూడా అధికారులు సిద్ధం చేస్తున్నారు.
మూడు హెలి ప్యాడ్ లు..
ఇక ఆంధ్రయూనివర్సిటీ గ్రౌండ్స్ లో మూడు హెలికాప్టర్ లు దిగేందుకు హెలిప్యాడ్ లు సిద్ధం చేశారు. ఇది మార్చిలో జరిగే సమ్మిట్ కోసమే అని చెబుతున్నా పరిపాలన రాజధాని కోసం ఈ ఏర్పాట్లు చేస్తున్నారని చెబుతున్నారు. ఇక ప్రభుత్వ భవనాలు కూడా దాదాపు సిద్ధమయ్యాయని చెబుతున్నారు. భీమిలీ రోడ్డులో ఉండే ప్రభుత్వ కార్యాలయాల్లోనే అన్ని కార్యాలయాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
Next Story

