Thu Mar 19 2026 04:42:53 GMT+0530 (India Standard Time)
కాసేపట్లో అమిత్‌షాతో జగన్ భేటీ
జగన్ రెండోరోజు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. కాసేపట్లో అమిత్‌షాతో జగన్ భేటీ కానున్నారు.

జగన్ రెండోరోజు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈరోజు వామపక్ష తీవ్రవాదంపై జరిగిన సదస్సులో ఆయన పాల్గొన్నారు. రాత్రి 8.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో అపాయింట్మెంట్ ఖరారయింది. అమిత్ షాను కలసి విభజన హామీలను అమలుపర్చాలని జగన్ కోరనున్నట్లు తెలిసింది.
రాజకీయ అంశాలపై....
దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగే అవకాశాలున్నాయి. స్కిల్ డెవలెప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్ట్ విషయంతో పాటు జనసేన, టీడీపీ పొత్తుల అంశాన్ని కూడా జగన్ అమిత్ షా వద్ద ప్రస్తావించే ఛాన్స్ ఉంది. ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలలు మాత్రమే సమయం ఉండటంతో వీరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
Next Story

