Fri Jan 24 2025 05:54:07 GMT+0000 (Coordinated Universal Time)
జగన్ జుట్టు ఎందుకు పెంచుతున్నారో తెలుసా? సభలో నేతల సెటైర్లు
జగన్ ఎప్పుడూ నీట్ గా క్రాఫ్ చేయించుకుని కనిపిస్తుంటారు. కొద్ది రోజులు నుంచి ఆయన క్రాఫ్ చేయించుకోవడంపై చర్చ జరుగుతోంది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎప్పుడూ నీట్ గా క్రాఫ్ చేయించుకుని కనిపిస్తుంటారు. అయితే గత కొద్ది రోజులు నుంచి ఆయన క్రాఫ్ చేయించుకున్నట్లు కనిపించడం లేదు. జుట్టు బాగా పెరిగింది. దీనిపై ఒంగోలులో జరిగిన సభలో నేతలతో పాటు అక్కడకు వచ్చిన కార్యకర్తలు కూడా చర్చించుకోవడం కనిపించింది. జగన్ క్రాఫ్ ఎందుకు చేయించుకోవడం లేదన్న దానిపై సరదాగా తలో మాట మాట్లాడుకుంటున్నారు.
బీజీగా ఉండటం వల్లనేనా?
అసలు జగన్ జుట్టు ఎందుకు పెంచుకుంటున్నారన్న దానిపై కొందరు ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో మొక్కు ఏమైనా మొక్కుకున్నారా? అని కొందరు చమత్కరించగా, సీట్ల సర్దుబాట్లు, వరసగా పర్యటనలు, అభ్యర్థుల ఎంపికలో మార్పులు, చేర్పులతో బిజీగా ఉండటం వల్లనే జగన్ క్రాఫ్ పెంచుతున్నారని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద వైసీపీ కార్యకర్తలతో పాటు నేతలు కూడా జగన్ క్రాఫ్ చేయించుకోక పోవడంపై జట్టు పెంచుకోవడంపై మాత్రం పెద్ద చర్చే జరుగుతుంది.
Next Story