Sun Mar 22 2026 17:01:51 GMT+0530 (India Standard Time)
Ys Jagan : జగన్ ప్రభుత్వం షాకిచ్చింది అందుకేనట
ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలను పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఆంధ్రప్రదేశ్ లో మద్యం ధరలను పెంచుతూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మద్యం ధరలను పెంచుతూ మరొకసారి నిర్ణయం తీసుకుంది. క్వార్టర్ బాటిల్ పై పది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకూ పెంచుతూ ఏపీ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వలు జారీ చేసింది. దీంతో మందుబాబులకు షాకిచ్చినట్లయింది.
ఆదాయం కోసం కాదు...
అయితే ప్రభుత్వం మాత్రం మద్యం ధరలను పెంచడం ప్రభుత్వం ఆదాయాన్ని పెంచుకోవడానికి మాత్రం కాదని, మద్యం అలవాటు ఉన్న వారిని మాన్పించడానికే ఈ ప్రయత్నమని తెలిపింది. కాగా మద్యం ధరలు పెంచుతూ గతంలోనూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పొరుగు రాష్ట్రమైన తెలంగాణతో పోలిస్తే ఏపీలో ధరలు ఎక్కువగా ఉన్నాయి.
Next Story

