Thu Mar 19 2026 12:14:08 GMT+0530 (India Standard Time)
Ys Jagan : ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్
ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జగన్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.

ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జగన్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పిన జగన్ తాజాగా వైద్య ఆరోగ్యశాఖలోని 397 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వైద్య ఆరోగ్య శాఖలోని కాంట్రాక్టు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తుననారు.
కాంట్రాక్టు ఉద్యోగులను...
ఇటీవల 2,146 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే 2014 ఏప్రిల్ ఒకటో తేదీ కంటే ముందు నుంచి పనిచేస్తున్న వారినే రెగ్యులరైజ్ చేసింది. ఈరోజు మరో 397 మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న 2,543 మందిని రెగ్యులరైజ్ చేసింది.
Next Story

