Thu Dec 18 2025 10:06:01 GMT+0000 (Coordinated Universal Time)
Ys Jagan : చంద్రబాబు పాలనలో అంతా ప్రయివేటుపరమే
ఆంధ్రప్రదేశ్ లో పేదలు బతకలేని పరిస్థితిని తెస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు

ఆంధ్రప్రదేశ్ లో పేదలు బతకలేని పరిస్థితిని తెస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అన్నీ ప్రయివేటు పరం చేస్తుండటంతో ఇక నిరుపేదలకు ఏదీ అందే అవకాశం లేదని జగన్ అన్నారు. పాఠశాలలను, ఆసుపత్రులను, బస్సులను కూడా ప్రయివేటీకరించే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉందని వైఎస్ జగన్ తెలిపారు. అన్ని వ్యవస్థలు తిరోగమనంలో పడ్డాయని అన్నారు. గతంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దు చేసి.. సూపర్ సిక్స్ అంటూ ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారని జగన్ చంద్రబాబు పై ధ్వజమెత్తారు.
వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నా...
వ్యవస్థలన్నీ కుప్పకూలిపోతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని చెప్పారు. ఏపీలో ప్రయివేటు దోపిడీ పెరిగిపోతుందని జగన్ అన్నారు. చంద్రబాబు పాలనలో గత ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నింటినీ రద్దు చేవారన్నారు. ప్రజలకు విద్య, వైద్యం ఇక అందడం కష్టమేనని, ప్రయివేటు దోపిడీ విపరీతంగా పెరుగుతుందని జగన్ అన్నారు. లక్షల కోట్లు అప్పు చేసి ఎవరి జేబుల్లోకి వెళుతున్నాయో చెప్పాలంటూ జగన్ ధ్వజమెత్తారు. మెడికల్ కళాశాలలను ప్రయివేటు పరం చ చేయడం వల్ల పేదలకు వైద్యం దూరమవుతుందని అన్నారు.
Next Story

