Tue Mar 17 2026 15:16:40 GMT+0530 (India Standard Time)
Ys Jagan : చంద్రబాబు చర్యలు ఎవరిపైనా ఉండవు
ఆంధ్రప్రదేశ్ లో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదని వైఎస్ జగన్ అన్నారు

ఆంధ్రప్రదేశ్ లో అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై చంద్రబాబు చర్యలు తీసుకోలేదని వైఎస్ జగన్ అన్నారు. ఒంగోలు నియోజకవర్గ కార్యకర్తలతో జగన్ సమావేశమై ఈ వ్యాఖ్యలు చేశారు. పుట్టా మహేష్ డ్రగ్స్ తీసుకుంటూ దొరికినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కేవలం షోకాజ్ నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్నారన్నారు.
ఏ ఆరోపణలొచ్చినా...
గతంలో ఆదిమూలంపైనా, తర్వాత గుమ్మడి సంధ్యారాణి పీఏ మీద, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే విచ్చలవిడిగా రాష్ట్రంలో డ్రగ్స్ దందా నడుస్తుందని అన్నారు. ఎమ్మెల్యే కూన రవికుమార్ మీద కూడా యాక్షన్ తీసుకోలేదని తెలిపార. అత్యాచారాలు, మోసాలపై కమిటీలు వేస్తూ కాలయాపన చేస్తున్నారని అన్నారు. ఇలా చంద్రబాబు చర్యలు తీసుకోకుండా నేతలను కాపాడే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
Next Story

