Thu Mar 19 2026 04:11:06 GMT+0530 (India Standard Time)
Ys jagan : నేడు నెల్లూరు జిల్లాలోకి వైఎస్ జగన్
వైఎస్ జగన్ బస్సుయాత్ర నేడు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. నేటికి ఎనిమిదో రోజుకు చేరుకుంది

వైఎస్ జగన్ బస్సుయాత్ర నేడు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. చిత్తూరు జిల్లాలో గురవరాజు పల్లె వద్ద రాత్రి బస చేసిన జగన్ నేటి ఉదయం బయలుదేరి మల్లవరం, ఏర్పేడు,పనగల్లు, శ్రీకాళహస్తి బైపాస్ మీదుగా చిన్న సింగమలకు చేరుకుంటారు. అక్కడ లారీ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లతో జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు.
నాయుడుపేటలో బహిరంగ సభ...
చావలిలో భోజన విరామానికి ఆగుతారు. అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం నాయుడుపేటకు చేరుకుంటారు. అక్కడి జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఓజిలి క్రాస్, బుదనం, గూడూరు బైపాస్, మనుబోలు, నెల్లూరు బైపాస్ మీదుగా చింతరెడ్డి పాలెం వద్ద రాత్రి బస చేయనున్నారు. నేటికి జగన్ బస్సు యాత్ర ఎనిమిదో రోజుకు చేరుకుంది.
Next Story

