Sun Jan 12 2025 21:47:29 GMT+0000 (Coordinated Universal Time)
అనకాపల్లి పార్లమెంటును హోల్డ్‌లో పెట్టిన జగన్
వైఎస్ జగన్ ఫైనల్ లిస్ట్ లో అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని తప్ప అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు
ఆంధ్రప్రదేశ్ లోని 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 24 స్థానాలకు అభ్యర్థులను వైసీపీ అధినేత జగన్ ప్రకటించారు. అయితే అనకాపల్లి స్థానాన్ని మాత్రం హోల్డ్ లో పెట్టారు. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్థిని తర్వాత ప్రకటిస్తామని జగన్ తెలిపారు. అక్కడ ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని ఖారారు చేయడాన్ని బట్టి జగన్ తర్వాత అనకాపల్లికి అభ్యర్థిని ఎంపిక చేసే అవకాశం ఉందని తెలిసింది.
ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని చూసిన తర్వాత...
అనకాపల్లి నుంచి పోటీకి ప్రత్యర్థి పార్టీ నుంచి అనేక మంది పోటీ పడుతున్నారు. ఒకవైపు జనసేన ఆ స్థానాన్ని తీసుకుంటే పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అదే సమయంలో ఆ స్థానాన్ని బీజేపీ కోరిందని, అక్కడి నుంచి సీఎం రమేష్ పోటీ చేస్తారని కూడా అంటున్నారు. అందుకే ప్రత్యర్థి అభ్యర్థిని బట్టి వైసీపీ అభ్యర్థిని ఖరారు చేయాలని నిర్ణయించుకున్నారు. మరో వైపు 175 శాసనసభ స్థానాలకు అభ్యర్థులను జగన్ ప్రకటించారు.
Next Story