Sat Mar 28 2026 05:57:09 GMT+0530 (India Standard Time)
జోగి రమేష్ ఇంటిని పరిశీలించిన జగన్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లారు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇబ్రహీంపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్లారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులను జగన్ పరామర్శించారు. ఇటీవల జోగి రమేష్ ఇంటిపై టీడీపీ శ్రేణులు పెట్రోలు బాంబులతో దాడి చేసిన ఘటనపై కుటుంబ సభ్యులను కలసి తెలుసుకుంటున్నారు. పోలీసులు ఆంక్షలు పెట్టిన భారీగా కార్యకర్తలు ఇబ్రహీంపట్నానికి తరలి వచ్చారు. తొలుత జోగి రమేష్ ఇంటికి చేరుకున్న జగన్ ధ్వంసమయిన ఇంటిని పరిశీలించారు. అనంతరం అక్కడ వీడియోలో ధ్వంసం జరిగిన దృశ్యాలను కుటుంబ సభ్యులు, వైసీపీ నేతలతో కలసి చూశారు.
ప్రత్యేకంగా మాట్లాడి...
జోగి రమేష్ తండ్రితో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆరోజు దాడి జరిగివనప్పుడు ఆయన ఒంటరిగా ఉన్నసమయంలో దాడి జరిగిందని తెలుసుకున్న జగన్ కుటుంబానికి భరోసా ఉంటామని హామీ ఇచ్చారు. జోగి రమేష్ కుటుంబ సభ్యులందరిని కలసి వారిని పరామర్శించారు. ఉదయం పదిన్నర గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి జగన్ జోగి రమేష్ ఇంటికి చేరుకునే సరికి సాయంత్రం ఐదు గంటలయింది. దాదాపు ఆరు గంటల సమయం పట్టింది. పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

