Wed Mar 18 2026 23:55:22 GMT+0530 (India Standard Time)
వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్
వైెఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు అయింది.

వైెఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు వైఎస్ భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ మంజూరు అయింది. ఈ నెల 30వ తేదీ వరకూ మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ కోర్టు తీర్పు చెప్పింది. అనారోగ్య కారణాల రీత్యా ఆయన మధ్యంతర బెయిల్ ను ఈ నెల 30వ తేదీ వరకూ ఇస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.
ఈ నెల 30 వరకూ...
అదే సమయంలో వచ్చే నెల 1వ తేదీన వైఎస్ భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైలుకు వెళ్లాలని ఆదేశించింది. ఉదయం పదిన్నర గంటల లోపు చేరుకోవాలని చెప్పింది. వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి నిందితుడిగా ఉన్నారు. అయితే అనారోగ్య కారణాలతో ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Next Story

