Tue Jan 20 2026 05:55:41 GMT+0000 (Coordinated Universal Time)
Avinash Reddy : నాపై ఈ నిందలు.. చంద్రబాబు డైరెక్షన్ లోనే
తనపై అనవసరంగా హత్యకేసు నిందలు మోపుతున్నారని వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు.

తనపై అనవసరంగా హత్యకేసు నిందలు మోపుతున్నారని వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తనను, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టేందుకు సొంత వాళ్లే కుట్రలు చేస్తున్నారన్నారు. తాను గెలవాలని వైఎస్ వివేకానందరెడ్డి కోరుకున్నారన్నారు. 2019 ఎన్నికల్లో తన తరపును ఆయన ప్రచారం చేసిన విషయాన్ని కూడా అవినాష్ రెడ్డి గుర్తు చేశారు. హత్యకు గల కారణాలు వేరే ఉన్నా సొంత కుటుంబ సభ్యులపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
రాజకీయ లబ్ది కోసమే...
కేవలం రాజకీయ లబ్ది కోసమే తనపై వైఎస్ షర్మిల, సునీతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. సీబీఐ అసలు విషయాలను పక్కన పెట్టి వాళ్లు చెప్పిన విషయాలనే పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. చంద్రబాబు డైరెక్సన్ లోనే వైఎస్ సునీత, వైఎస్ షర్మిల నడుస్తున్నారన్నారు. చంద్రబాబు ట్రాప్ లో ప్రజలు పడవద్దని అవినాష్ రెడ్డి కోరారు. నిజం ఎప్పటికైనా తెలుస్తుందని, అది దాచినా దాగదన్న అవినాష్ రెడ్డి అసలు నిందితులు ఎవరో త్వరలోనే తేలుతుందని చెప్పారు.
Next Story

