Thu Dec 18 2025 13:38:53 GMT+0000 (Coordinated Universal Time)
వైసీపీ వివాదాస్పద ట్వీట్
శివరాత్రి సందర్భంగా వైసీపీ చేసిన ట్వీట్ వివాదంగా మారింది. హిందువులను అవమానపర్చారంటూ బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు

శివరాత్రి సందర్భంగా వైసీపీ చేసిన ట్వీట్ వివాదంగా మారింది. హిందువులను కావాలనే అవమానపర్చేలా ట్వీట్ చేశారంటూ బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఆందోళనకు దిగారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాల వద్ద నిరసన వ్యక్తం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పిలుపునిచ్చారు.
శివరాత్రి సందర్భంగా...
నిన్న శివరాత్రి సందర్భంగా వైసీపీ అఫిషియల్ సోషల్ మీడియా నుంచి ఒక ట్వీట్ విడుదలయింది. అందులో బాల శివుడికి జగన్ పాలుపట్టిస్తున్నట్లు ఉంది. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఫొటోలో చిన్నారి చేతిలో ఢమరుకం, చిరుతపులి తోలు ఉన్న దుస్తులు, పక్కనే నంది ఉంచి అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధన. ఆ శివయ్య చల్లని దీవెనుల ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటూ.. అంటూ ట్వీట్ చేశారు. దీనికి హిందు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జగన్ క్షమాపణ చెప్పాలని, వెంటనే ట్వీట్ ను తొలగించాలని డిమాండ్ చేశాయి.
- Tags
- ycp
- controversy
Next Story

