Sun Feb 01 2026 15:34:46 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : పల్నాడులో ఫ్యాన్ పార్టీకి భారీ షాక్.. కీలక నేతలందరూ
వైసీపీకి పల్నాడు జిల్లా లో భారీ షాక్ తగలనుంది. కీలక నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు

వైసీపీకి పల్నాడు జిల్లా లో భారీ షాక్ తగలనుంది. కీలక నేతలు పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. రేపు వీళ్లంతా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నరసారావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు పార్టీని వీడిన సంగతి తెలిసిందే. ఆయన టీడీపీలో చేరనున్నారు.
లావుతో పాటు...
ఆయనతో పాటుగా ఎమ్మెల్సీ జాంగా కృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లిఖార్జున రావు కూడా రేపు టీడీపీలో చేరే అవకాశముందని తెలిసింది. వీరితో పాటు 46 మంది మునిసిపల్ కౌన్సిలర్లు, 14 జడ్పీటీసీ, 32 ఎంపీటీసీ సభ్యులు కూడా వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే జరిగితే టీడీపీకి పల్నాడు ప్రాంతంలో భారీ షాక్ తగిలినట్లేనని అనుకోవాల్సి ఉంటుంది.
Next Story

