Fri Jan 17 2025 08:49:20 GMT+0000 (Coordinated Universal Time)
YCP : చంద్రబాబు ఆ లింక్ కట్ చేయాలనే ఇలా చేశారు
వాలంటీర్లపై చంద్రబాబు కక్షకు పరాకాష్ఠ అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు
వాలంటీర్లపై చంద్రబాబు కక్షకు పరాకాష్ఠ అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చంద్రబాబు ముఖ్య ఉద్దేశం వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయాలన్నదేనని అన్నారు. వీళ్లు చంద్రబాబు తరఫునే పనిచేస్తున్నారనేదే దేశమంతా తెలుసునని అన్నారు. ఈ వ్యవస్థను దెబ్బతీయాలనే చంద్రబాబు ఉద్దేశం, ఆ చెడ్డ పేరు తనమీదకు రాకూడదనే ఈ సంస్థతో చేయించారన్నారు. గత నాలుగేన్నరేళ్లుగా తమ మనుమడు జగన్ ఇస్తున్న పింఛన్ తీసుకుంటున్న వృద్ధులు ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారన్నారు.
ఈరోజు ఇబ్బంది కాదు...
ఆ లింక్ ను చంద్రబాబు కట్ చేయించారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇది ఒక్క రోజు ఇబ్బంది అనేది ఒకటైతే..ఆయనొస్తే రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో ఆర్ధం చేసుకోవాలని సజ్జల కోరారు. ఇప్పటికీ 2014–19 మధ్య పాత రోజులు ఇంకా గుర్తుండే ఉంటాయని, కాళ్లరిగేలా పింఛన్ కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఇంతకంటే కక్ష మరొకటి ఉందా? అసలు ఒక రాజకీయ పార్టీ వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందే చంద్రబాబు తన నిజస్వరూపాన్ని ప్రజలు చూపిస్తున్నారన్నారు.
Next Story