Fri Jan 30 2026 00:02:45 GMT+0000 (Coordinated Universal Time)
సజ్జల భార్గవ్‌రెడ్డికి పోలీసులు నోటీసులు
వైసీపీ సోషల్ మీడియా ఇన్ ఛార్జి సజ్జల భార్గవరెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు

అధికార పార్టీ నేతలను సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్న వైసీపీ కార్యకర్తలను సమన్వయం చేస్తున్న ఆ పార్టీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి సజ్జల భార్గవ్‌రెడ్డి, మాజీ సీఎం జగన్ బంధువు అర్జున్ రెడ్డిపై కడప జిల్లా పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదయింది. ఈ కేసుకు సంబందించి తాజాగా భార్గవ్ రెడ్డి, అర్జున్ రెడ్డిలకు పులివెందుల పోలీసులు 41-ఏ నోటీసులు ఇచ్చారు.
నోటీసులు జారీ చేసి...
విజయవాడలోని సజ్జల భార్గవ్ రెడ్డి ఇంటికి వెళ్లిన పులివెందుల పోలీసులు.. ఆయన తల్లికి నోటీసులు ఇచ్చారు. పులివెందులోని అర్జున్ రెడ్డి ఇంటికి నోటీసులు అంటించారు. సోమవారం విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అసభ్యకరమైన పోస్టుల పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి కేసులో పోలీసులు మరో 15 మందికి నోటీసులు జారీ చేశారు.
Next Story

