Sun Mar 15 2026 23:14:07 GMT+0530 (India Standard Time)
ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిందే
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు. లోక్ సభలో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. 377 నిబంధన కింద ఆయన లోక్ సభలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిందని రఘురామ కృష్ణరాజు అన్నారు.
కేంద్ర జోక్యం అసవరం....
దీనిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు. కేంద్రం ఇప్పుడు జోక్యం చేసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ కు తీవ్రమైన నష్టం చేకూరుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక ఎమెర్జెన్సీ విధించడం తప్ప మరొక గత్యంతరం లేదని రఘురామ కృష్ణరాజు తెలిపారు.
Next Story

