Sat Mar 07 2026 22:46:35 GMT+0530 (India Standard Time)
రాజీనామా ఖాయం... ఎప్పుడనేదే?
తాను రాజీనామా చేయడం ఖాయమని, ఎప్పుడనేది త్వరలో చెబుతానని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు

తాను రాజీనామా చేయడం ఖాయమని, ఎప్పుడనేది త్వరలో చెబుతానని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. అమరావతి రైతుల కోసమే తన రాజీనామా ఉండనుందన్నారు. తిరుపతిలో జరిగిన అమరావతి రైతుల సభలో తాను పాల్గొన్నానని వైసీీపీ నేతలు తనపై ఫిర్యాదు చేయడానికి రెడీ అయ్యారని, మరో పదిహేను రోజుులు సమయం ఇస్తున్నానని, తనపై అనర్హత వేటు వేయించాలని రఘురామ కృష్ణరాజు సవాల్ విసిరారు. వైసీపీ నేతలు రెచ్చగొట్టకుండా ఉండి ఉంటే ఈ పాటికి రాజీనామా చేసి ఉండేవాడినని అన్నారు.
పదిహేను రోజుల్లో.....
ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయని, అది జరిగే సమయంలోనైనా తనపై అనర్హత వేటు వేయడానికి ప్రయత్నించాలని అన్నారు. తాను పార్టీ లైన్ లను ఎక్కడా దాటలేదని చెప్పారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలంటూ తన రాజీనామా ఉండబోతుందన్నారు. విజయసాయిరెడ్డి అండమాన్ లో విహార యాత్రలను మానుకుని ప్రజాసమస్యలను పట్టించుకోవాలని కోరారు. తనపై అనర్హత వేటు పడుతుందని ఏక చిత్రత నటుడు విసిరిన సవాల్ ఏమయిందని పరోక్షంగా ఎంపీ భరత్ పై ఆయన విమర్శలు చేశారు.
Next Story

