Sun Mar 08 2026 02:54:35 GMT+0530 (India Standard Time)
నేడు స్పీకర్ ఎదుటకు రెబల్ ఎమ్మెల్యేలు
వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం ఎదుట హాజరు కావడానికి నేడు హాజరు కావాల్సి ఉంది

వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు నేడు స్పీకర్ తమ్మినేని సీతారాం ఎదుట హాజరు కావడానికి నేడు హాజరు కావాల్సి ఉంది. ఇదే చివరి అవకాశమని ఆయన ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు స్పీకర్ కార్యాలయానికి వచ్చి అనర్హత వేటు విషయంలో తమ వాదనను వినిపించుకోవాలని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు.
వైసీపీ నుంచి గెలిచి....
వైసీపీ నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణరెడ్డిలకు మూడు రోజుల క్రితం స్పీకర్ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 19వ తేదీన హాజరు కావాలని ఆయన నోటీసుల్లో పేర్కొన్నారు. ఇదే చివరి అవకాశమని అందులో పేర్కొన్నారు. అయితే వారు న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపి, విచారణకు హాజరు కావాలా? వద్దా? అన్నది నిర్ణయించుకోనున్నారని తెలిసింది.
Next Story

