Sun Dec 14 2025 11:30:37 GMT+0000 (Coordinated Universal Time)
అదిరేది లే.. బెదిరేది లే.. దేనికైనా రెడీ
వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి పార్టీ నేతలపై మండి పడ్డారు.

వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి పార్టీ నేతలపై మండి పడ్డారు. తనపై కిడ్నాప్ కేసు పెట్టారని, దేనికి భయపడబోనని ఆయన తెలిపారు. కాకాణి గోవర్థన్ రెడ్డి గతంలో జగన్ తో వెళితే మన రాజకీయ జీవితానికి భరోసా ఉండదని తనతో అనలేదా? అని ప్రశ్నించారు. తాను సైలెంట్ గానే పార్టీలో నుంచి వెళ్లాలనుకున్నా వైసీపీ నేతలు, మంత్రులు రెచ్చగొడుతున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఫైర్ అయ్యారు.
కాకాణి.. జాగ్రత్త...
తాను అదరను.. బెదరను.. అని అన్నారు. ఆనం రామనారాయణరెడ్డిని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి ఎలాటి ఇబ్బందులు పెట్టారో అందరికీ తెలుసునన్నారు. కాకాణి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తాను ఏ పార్టీలో ఉన్నా వీర విధేయుడిగానే ఉంటానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. తనను ఫోన్ లో బెదిరిస్తే తాను వీడియో కాల్స్ చేసి మరీ బెదిరించగలనని హెచ్చరించారు. తనపై ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోవచ్చని, తాను భయపడేది లేదని తెలిపారు.
Next Story

