Tue Jan 20 2026 18:17:42 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : వైసీపీ ఇద్దరు రాజ్యసభ సభ్యుల రాజీనామా
వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావులు రాజీనామాలు చేశారు

వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్‌రావులు రాజీనామాలు చేశారు. రాజ్యసభ ఛైర్మన్ ను కలసి తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. వైసీపీ ప్రాధమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసినట్లు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. అయితే బీద మస్తాన్ రావు మాత్రం తన భవిష్యత్ ప్రణాళికను అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
టీడీపీలోకి...
మోపిదేవి వెంకటరమణ మాత్రం తాను టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు. లోకేష్ సమక్షంలో ఆయన టీడీపీలో చేరనున్నట్లు తెలిపారు. దీంతో ఆంధ్రప్రదేశ్ లో రెండు రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినట్లు. త్వరలోనే ఉప ఎన్నికలు జరుగుతాయి. అయితే ఖాళీ అయిన రెండు రాజ్యసభ స్థానాలను కూటమి పార్టీ కైవసం చేసుకుంటుంది. శాసనసభలో అత్యధికంగా బలం ఉండటంతో రెండు స్థానాలను కూటమి కైవసం చేసుకుంటుంది.
Next Story

