Thu Dec 18 2025 07:30:17 GMT+0000 (Coordinated Universal Time)
నందమూరి బాలకృష్ణకు థాంక్స్ : విజయసాయిరెడ్డి
తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు

తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్నను ఆయన పరామర్శించారు. వైద్యులను అడిగిన తారకరత్నం ఆరోగ్య పరిస్థితి గురించి విజయసాయిరెడ్డి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
మెదడులోకి నీరు చేరడంతో...
తారకరత్న గుండె బాగా పనిచేస్తుందని వైద్యులు చెప్పారన్నారు. అయితే గుండె నలభై ఐదు నిమిషాలు ఆగిపోవడంతో మెదడు పై భాగంలో నీరు చేరిందన్నారు. వాపు తగ్గితే తిరిగి మెదడు పనిచేస్తుందని విజయసాయి రెడ్డి తెలిపారు. బాలకృష్ణ సరైన సమయంలో స్పందించి నారాయణ హృదయాలయకు తీసుకు వచ్చే ప్రయత్నం చేశారన్నారు. ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని విజయసాయిరెడ్డి తెలిపారు.
Next Story

