Thu Mar 19 2026 12:14:05 GMT+0530 (India Standard Time)
పురంద్రీశ్శరిపై మరోసారి విజయసాయి ఫైర్
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరిపై మరోసారి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరిపై మరోసారి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. లిక్కర్ స్కాంలో లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రజల దృష్టిని మరల్చడానికే ఇలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. ఊరికే ఆరోపణలు చేయడం తగదని ఆయన సూచించారు. నిరాధార ఆరోపణలు చేసి ప్రభుత్వంపై బురద చల్లడం తగదన్నారు.
లిక్కర్ స్కామ్ పై...
లిక్కర్ స్కామ్ పై పురంద్రీశ్వరి తన వద్ద ఆధారాలున్నాయని అంటున్నారని, ఉంటే వెంటనే ఆధారాలను సీఐడీకి అందచేయాలని విజయసాయిరెడ్డి కోరారు. నిందితులకు శిక్ష పడాలంటే తన దగ్గరున్న ఆధారాలను సీఐడీ అధికారులకు అందచేయాలన్నారు. సాక్షిగా సీఐడీకి తన వాంగ్మూలం ఇవ్వాలని ఆయన కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
Next Story

