Sun Dec 08 2024 08:47:36 GMT+0000 (Coordinated Universal Time)
Vijaya Sai Reddy : చంద్రబాబుకు సూటి ప్రశ్నలు వేసిన విజయసాయిరెడ్డి
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూటి ప్రశ్నలు వేశారు
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సూటి ప్రశ్నలు వేశారు. ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. అనేక అంశాలపై ఆయన చంద్రబాబుకు ప్రశ్నలు వేశారు. విశాఖలోని తన కుమార్తె నేహారెడ్డి స్థలంలో నిర్మాణాలను రెండోసారి కూల్చివేయడంపై ఆయన ఈ ప్రశ్నలు వేశారు. తోడల్లుళ్లు కుమ్మకై రాజకీయ కక్షతో భీమిలిలో తమ ప్రైవేట్ స్థలం లో ఈరోజు మళ్ళి రెండవసారి ప్రహరీ పగలగొట్టడం పిల్లచేష్టలుగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు నివసిస్తున్న కృష్ణానది కరకట్టపై ఉన్న అక్రమ కొంపను ఆ చట్టం, ఆ నిబంధనల ప్రకారమే కూల్చమని పలుసార్లు విజ్ఞప్తి చేశానని, బుద్ధిహీనత వల్ల మీరు అది చెయ్యలేరని ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి ఇంకా చంద్రబాబును విజయసాయిరెడ్డి ఏం ప్రశ్నలు వేశారంటే?
తిరుమల వెయ్యికాళ్ల మండపం ఎందుకు కూల్చావు?
విజయవాడలో 50కు పైగా గుళ్ళు ఎందుకు కూల్చావు.
దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు ఎందుకు చేసావు.
బూట్లు వేసుకుని ఎందుకు పూజలు చేస్తావు.
రాష్ట్రంలో విగ్రహాలు ధ్వసం చేసి మాపై నిందలు ఎందుకు వేశావు.
పవిత్రమైన ప్రసాదం లడ్డు మీద ఎందుకు విషప్రచారం చేసావు.
నీలాంటి దుర్మార్గుడిని బహిష్కరిస్తే గానీ సమాజం బాగుపడదు.
ప్రసాదం స్వీకరించే ప్రతి భక్తుడు నిన్ను ఛీ కొడుతున్నాడు.
తిరుమల ప్రసాదంలో ఏ కల్తీ లేదు, కల్తీ అంతా నీ బుర్ర, మనసు నీ చరిత్ర, నీ మానసిక రుగ్మత.
ఆరోపణలే తప్ప నీ జీవితం లో నిరూపణలు వుండవు.
బట్ట కాల్చి ముఖానవేసి ప్రత్యర్థిని తుడుచుకో అంటావు.
నీ అధికారం నీ డబ్బు సంపాదన కోసమే తప్ప ప్రజలకోసం మాత్రం కాదు.
ఆ డబ్బుతో వ్యవస్థలను మానేజ్ చేస్తావు.
విలువలకు ఎన్నడో వలువలు ఊడ్చిన నువ్వు ఒక మనిషివేనా!
దేవదేవుడు నిన్ను ఎప్పటికి క్షమించడు.
కలియుగంలో నీ అంత పాపం ఎవరూ చేసి ఉండరు.
నీ ప్రవర్తనతో రావణాసురుడు, కంసుడు, కీచకుడు సిగ్గుపడేలా చేశావు.
నీలాంటి వ్యక్తి పాలకుడు కావడం తెలుగు జాతి దురదృష్టం అని అంటూ నారా చంద్రబాబు నాయుడు నిఖార్సయిన నాయకుడైతే క్రింది ప్రశ్నలకు జవాబు ఇవ్వాలంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
Next Story