Wed Mar 18 2026 20:04:25 GMT+0530 (India Standard Time)
YSRCP : వైసీపీని వీడను.. జగన్‌తోనే నా ప్రయాణం
వైసీపీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాధరెడ్డి తన రాజీనామాపై స్పందించారు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాధరెడ్డి తన రాజీనామాపై స్పందించారు. తాను రాజ్యసభ పదవికి రాజీనామా చేయబోనని తెలిపారు. వైసీపీని వీడే ప్రసక్తి లేదని మేడా రఘునాధరెడ్డి తెలిపారు. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకూ జగన్ తోనే తన ప్రయాణమని ఆయన స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన తెలిపారు.
తప్పుడు ప్రచారమే...
తనపై జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమేనని మేడా రఘునాధరెడ్డి తెలిపారు. జగన్ నాయకత్వంలోనే తాను పనిచేస్తానని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంత వరకూ తన ప్రయాణం జగన్ తోనే సాగుతుందని స్పష్టం చేశారు. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఈ ప్రకటనతోనైనా మానుకోవాలని ఆయన కోరారు.
Next Story

