Sat Mar 28 2026 17:54:49 GMT+0530 (India Standard Time)
YSRCP : పోతిరెడ్డి ప్రాజెక్టుపై నేడు వైసీపీ ఆందోళన
పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో నేడు వైసీపీ ఆందోళనకు దిగుతుంది

పోతిరెడ్డి ప్రాజెక్టు విషయంలో నేడు వైసీపీ ఆందోళనకు దిగుతుంది. నంద్యాల జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈరోజు జూపాడు బంగ్లా మండలం పోతిరెడ్డి పాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పనులను చేపట్టాలని వైసీపీ ఆందోళన చేయనుంది. చంద్రబాబు, రేవంత్ రెడ్డి కుమ్మక్కై పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు పనులను నిలిపేశారంటూ ఆందోళన చేస్తుంది. ఈ ఆందోళనకు ఆరు జిల్లాల నుంచి వైసీపీ నేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు.
ఈ బహిరంగ సభలో...
ఈ బహిరంగ సభలో జిల్లాల్లోని నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నేతలతో పాటు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ ఛార్జులతో సమావేశమవుతారు. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి భారీగా వైసీపీ శ్రేణులు ఈ సభకు హాజరు కానున్నారు. దీంతో భారీగా పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సభకు అనుమతివ్వకపోవడంతో న్యాయస్థానానికి వెళ్లి అనుమతి తెచ్చుకున్నారు.
Next Story

