Sun Mar 15 2026 11:54:07 GMT+0530 (India Standard Time)
నేడు జగన్ కీలక ప్రసంగం
వైసీీపీ ప్లీనరీ నేటితో ముగియనుంది. నేడు జగన్ ను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు.

వైసీీపీ ప్లీనరీ నేటితో ముగియనుంది. నాగార్జున యూనివర్సిటీలో జరుగుతున్న ఈ సమావేశాల్లో నిన్న నాలుగు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఈరోజు ఐదు తీర్మానాలను ప్రవేశపెడతారు. సామాజిక సాధికారిత, వ్యవసాయం, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ ప్రోత్సహకాలు, దుష్టచతుష్టయంపై తీర్మానాలు చేసి చర్చ జరుగుతుంది.
ముగింపు ఉపన్యాసంలో...
ఈరోజు ముగింపు ఉపన్యాసాన్ని వైసీపీ అధినేత జగన్ చేయనున్నారు. నేడు జగన్ ను పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. ఈరోజు జగన్ ఉపన్యాసంలో కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశముంది. రానున్న రెండేళ్ల కాలంలో అమలు చేయనున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిపై కొన్ని విషయాలను జగన్ ప్రస్తావించారు.
Next Story

