Thu Jan 29 2026 04:42:02 GMT+0000 (Coordinated Universal Time)
Vijaya Sai Reddy : ఈడీవిచారణపై విజయసాయిరెడ్డి ఏమన్నారంటే?
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈరోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు.

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని ఈరోజు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రశ్నించారు. సుమారు ఆరు గంటల పాటు ఆయనను ప్రశ్నించారు. విచారణ నుంచి బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కాకినాడ సీ పోర్టు అంశంలో తనకు ఏ సంబంధం లేదని విజయసాయిరెడ్డి తెలిపారు. తాను సివిల్ అండ్ క్రిమినల్ కేసు వేస్తానని ఆయన అన్నారు. తనపై ఫిర్యాదు చేసిన కేవీరావు పేరులోనే వెంకటేశ్వరస్వామి పేరు ఉందని, తాను ఆయనను బెదిరించినట్లు తిరుమల వెంకటేశ్వరస్వామి సమక్షంలో ప్రమాణం చేయగలరా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
కాకినాడ సీపోర్టు విషయంలో...
కాకినాడ సీపోర్టు విషయంలో తాను ఎవరికీ ఫోన్ చేయలేదన్నారు. తాను అప్పటి ప్రభుత్వంలో భాగస్వామిని కాదన్న విజయసాయిరెడ్డి 2020 మే నెలలో తనకు ఫోన్ చేసినట్లు కేవీ రావు తన ఫిర్యాదులో పేర్కొన్నారని, ఆయన కాల్ డేటా తీసి పరిశీలించాలని ఈడీ అధికారులను తాను కోరానని అన్నారు. శరత్ చంద్రారెడ్డికి, తనకు వ్యాపార సంబంధాలు ఏమీ లేవని, కేవలం కుటుంబ బాంధవ్యాలు మాత్రమే ఉన్నాయని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. కేవీ రావు ఫిర్యాదు మేరకే ఈడీ అధికారులు తనను విచారించారన్న ఆయన ఇద్దరినీ కూర్చోబెట్టి క్రాస్ ఎగ్జామినేషన్ కు అనుమతివ్వాలని తాను ఈడీ అధికారులను కోరానని విజయసాయిరెడ్డి తెలిపారు.
ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ
Next Story

