Fri Dec 05 2025 18:51:23 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : పురంద్రీశ్వరిపై విజయసాయిరెడ్డి మరోసారి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరిని లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేశారు

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో నిత్యం యాక్టివ్ గా ఉంటారు. ఇటీవల కాలంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరిని లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేస్తున్నారు. పురంద్రీశ్వరి టీడీపీకి బహిరంగంగానే మద్దతు పలుకుతుందని ఆరోపిస్తున్నారు. అంతే కాదు పురంద్రీశ్వరి లేవనెత్తే ప్రతి అంశంపై ట్విటర్ వేదికగా సమాధానమిస్తున్నారు. అది అవినీతి మీద కావచ్చు. మరో ఆరోపణలమీదైనా అవ్వొచ్చు. వెంటనే సమాధానమిస్తూ విజయసాయిరెడ్డి పురంద్రీశ్వరి విమర్శలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు.
పార్టీ బాధ్యతలను...
ఈరోజు కూడా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు అనారోగ్యం - బెయిల్ షరతులు సరే.. పార్టీలో లోకేష్ - భువనేశ్వరిగారు అందరూ ఏమయ్యారని ఆయన ప్రశ్నించారు. ఇక టీడీపీ పని అయిపోయిందన్న నిర్ధారణకు వచ్చారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ తరహాలోనే టీడీపీ జెండాను ఆంధ్రాలో పీకేశారా? లేక టీడీపీ భారమంతా పురంద్రీశ్వరిపైనే పెట్టారా? ఆమె సొంత పార్టీని ముంచడంలో దిట్ట కావచ్చేమో కాని బావగారి పార్టీని బతికించడంలో కాదు సుమా అంటూ ట్వీట్ చేశారు.
Next Story

