Sun Mar 15 2026 12:43:18 GMT+0530 (India Standard Time)
నేడు వైసీపీ ఎంపీ టీడీపీలో చేరిక
తెలుగుదేశం పార్టీలో నేడు వైసీపీ ఎంపీ సంజీవ్ కుమార్ చేరనున్నారు

తెలుగుదేశం పార్టీలో నేడు వైసీీపీ ఎంపీ సంజీవ్ కుమార్ చేరనున్నారు. 2019 ఎన్నికల్లో సంజీవ్ కుమార్ వైసీపీ నుంచి విజయం సాధించారు. చేనేత సామాజికవర్గానికి చెందిన సంజీవ్ కుమార్కు జిల్లాలో మంచి పేరుంది. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లా నుంచి పోటీ చేసి ఆయన విజయం సాధించారు. అయితే ఈసారి వైసీపీ ఆయనకు టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించింది.
వైసీపీకి రాజీనామా చేసి...
దీంతో సంజీవ్ కుమార్ కొద్ది రోజుల క్రితం వైసీపీతో పాటు పార్లమెంటు సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఆయన తన రాజకీయ నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ఈరోజు చంద్రబాబు సమక్షంలో వైసీపీ పార్లమెంటు సభ్యుడు సంజీవ్ కుమార్ పార్టీలో చేరనున్నారు. ఆయన చేరికతో కర్నూలు జిల్లాలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.
Next Story

